Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 July 2025, 11:15 pm Posted by : ramakrishna

బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై హర్షం

  • మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దారస్ వార్ సాయిలు

 

మద్నూర్, బతుకమ్మ: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవడాన్ని స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాయిలు అన్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వము చేపడుతున్నటువంటి బీసీల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసి 42% ఆర్డినెన్స్ అమలు చేయడం పై హర్షం వ్యక్తం చేశారు. ఏ పార్టీ చేయాని పని కాంగ్రెస్ పార్టీ చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో రామ్ పటేల్, మార్కెట్ వైస్ చైర్మన్ పమేష్ పటేల్, హనుమంత్ యాదవ్ తదితరులు ఉన్నారు.