Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 July 2025, 2:12 pm Posted by : ramakrishna

బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం తెచ్చే ఆర్డినెన్సుపై హర్షం

ఎవరైనా బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడాలని చూస్తే వాళ్ల పని పడుతాం

నిజామాబాద్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నరాల సుధాకర్.

నిజామాబాద్, బతుకమ్మ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్సు తేవడాన్ని స్వాగతిస్తున్నామని జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు. ఈసందర్భంగా ఆయన నగరంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ ప్రభుత్వాలు బీసీల కోసం ఇంతగా ఆలోచిస్తున్నాయంటే కారణం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అని అన్నారు. జాజుల శ్రీనివాస్ గౌడ్  గత 30 సంవత్సరాలుగా చేస్తున్న పోరాట ఫలితమే, ఈ రోజు బీసీలకు 42% రిజర్వేషన్లు అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెస్తున్న ఈ 42% రిజర్వేషన్లను అడ్డుకోవాలని చూస్తే వారి పని పడుతామని హెచ్చరించారు. అదేవిధంగా బీసీల అభ్యున్నతికై నిరంతరం పోరాటం చేస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు  కల్వకుంట్ల కవిత, ఇతరులకు కూడా ధన్యవాదాలు అని అన్నారు.కార్యక్రమంలో దర్శనం దేవేందర్, కొయ్యాడ శంకర్, కోడూరు స్వామి, బగ్గలి అజయ్, శ్రీలత, చంద్రకాంత్, నరేందర్, రమేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.