బోధన్ మార్కెట్ కమిటీ ఇంచార్జీ చైర్మన్ గా చీల శంకర్
బోధన్, బతుకమ్మ : మార్కెట్ కమిటి ఛైర్మెన్ గా వ్యవహరిస్తున్న అంకు సంధ్యాకు టీచర్ ఉద్యోగం రావడంతో బోధన్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న చీల శంకర్ బుధవారం ఇంచార్జ్ ఛైర్మెన్ గా పదవి బాద్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ లో రైతులకు అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మార్కెట్ కమిటీకి వరి ధాన్యాన్ని తరలించే రైతులకు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు....