Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 April 2025, 5:49 pm Posted by : ramakrishna

బోధన్ మార్కెట్ కమిటీ ఇంచార్జీ చైర్మన్ గా చీల శంకర్

బోధన్, బతుకమ్మ : మార్కెట్ కమిటి ఛైర్మెన్ గా వ్యవహరిస్తున్న అంకు సంధ్యాకు టీచర్ ఉద్యోగం రావడంతో బోధన్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న చీల శంకర్ బుధవారం ఇంచార్జ్ ఛైర్మెన్ గా పదవి బాద్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ లో రైతులకు అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మార్కెట్ కమిటీకి వరి ధాన్యాన్ని తరలించే రైతులకు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ గంగా శంకర్, కాంగ్రెస్ నాయకులు నాగేశ్వరరావు, నరేందర్ రెడ్డి, ప్రకాష్ శ్రీను నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Cheela Shankar as the in-charge chairman of Bodhan Market Committee