Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 May 2025, 6:27 pm Posted by : ramakrishna

ప్రైవేట్ ఆసుపత్రులలో తనిఖీలు

  • పోలీస్, వైద్య ఆరోగ్య శాఖ, అగ్నిమాపక శాఖల పరిశీలన
  • అగ్ని ప్రమాదాల నేపథ్యంలో బృందం సభ్యుల సోదాలు

 

నిజామాబాద్, బతుకమ్మ: ఇటీవలి కాలంలో తెలంగాణలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ఆదేశాల మేరకు అగ్నిప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల పట్ల హాస్పిటళ్లలో భద్రతా చర్యల అమలును పరిశీలించేందుకు సంయుక్త బృందం తనిఖీలు చేపట్టింది. పోలీస్, వైద్య ఆరోగ్యశాఖ, అగ్నిమాపక శాఖలు సోమవారం ప్రైవేట్ ఆసుపత్రులలో తనిఖీలు చేపట్టాయి. ప్రుడెన్స్ హాస్పిటల్, తక్ష్ హాస్పిటల్, మెడికవర్ హాస్పిటల్ లో బృందం ప్రతి హాస్పిటల్‌ లో  చెక్ లీస్ట్ ఆధారంగా పరిశీలనలు జరిపింది. తనిఖీల్లో కొన్ని లోపాలు

Checks in private hospitals

గుర్తించబడ్డాయి. ముఖ్యంగా అగ్నిప్రమాద నివారణ పరికరాల నిర్వహణ, అత్యవసర నిష్క్రమణ మార్గాల నిర్దిష్టత, సిబ్బంది అవగాహనలో లోపాలు ఉన్నట్టు గుర్తించారు. ప్రైవేట్ ఆసుపత్రులలో గుర్తించిన లోపాలను తక్షణమే సరిచేసి, అగ్నిప్రమాద భద్రతా నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకోవాలని హాస్పిటల్ నిర్వాహకులకు సూచించారు. నగర సిఐ శ్రీనివాస్ రాజు, ఆగ్నిమాపకశాఖ అధికారి పరమేశ్వర్, జిల్లా వైధ్య ఆరోగ్యశాఖ డిప్యూటి డియంహెచ్ఓ డాక్టర్ అంజన లు తనిఖీలు నిర్వహించారు.

Checks in private hospitals