రేషన్ షాపులు, మీ-సేవా కేంద్రాలను తనిఖీ చేయండి
అధికారులను ఆదేశించిన145 కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి నిజామాబాద్, బతుకమ్మ : జిల్లాలోని అన్ని రేషన్ షాపులు, మీ-సేవా కేంద్రాలను క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి కలెక్టర్ గురువారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా వివిధ అంశాలపై తహసిల్దార్లు, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో లోటుపాట్లకు తావులేకుండా ఉండేందుకు గాను క్షేత్రస్థాయిలో చౌక ధరల దుకాణాలను సందర్శించి, వాటి పనితీరును పరిశీలించాలని సూచించారు. అన్ని రేషన్ షాపులలో...