Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 January 2025, 4:43 pm Posted by : ramakrishna

మధ్యాహ్నభోజనం తనిఖీ

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల లో మధ్యాహ్నం భోజనం వికటించటం వల్ల ప్రధానోపాధ్యాడిని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా శుక్రవారం మధ్యాహ్నభోజనాన్ని పరిశీలించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని ఆర్డీవో ప్రభాకర్ ఆదేశించారు. శుక్రవారం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఆయన పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వంటశాలలో పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, వంట సామాగ్రి ఎప్పటికప్పుడు తెచ్చుకోవాలని నిర్వాహకులకు సూచించారు. పాఠశాలలో మరోసారి మధ్యాహ్న భోజనం వికటించకుండా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఆయన వెంట డిప్యూటీ తహశీల్దార్​ చరణ్, ఉపాధ్యాయులు ఉన్నారు.

Check out lunch