జిల్లాకు చెందిన శాస్త్రవేత్త చారికి యూరో ఏషియన్ యూనివర్సిటీ డాక్టరేట్

నిజామాబాద్, బతుకమ్మ: జిల్లాకు చెందిన శాస్త్రవేత్త, తన ప్రయోగాలకు ప్రపంచస్థాయిలో పేటెంట్ పొందిన మండాజి నర్సింహచారి యూరో ఏషియన్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. గతనెల 31న దేశ ఆర్థికరాజధాని ముంబైలో యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి చారిని ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రపంచ పేటెంట్ ద్వారా చారి సాధించిన అద్భుతాన్ని ప్రపంచంలో ఎవరూ సాధించలేదని, దీని ముఖ్య ఉద్ధేశమే ఆయనకు గౌరవ డాక్టరేట్ అందజేయడమని పేర్కొన్నారు. చారి వరల్డ్ పేటెంట్ సాధించిన ప్రయోగం ప్రపంచస్థాయిలో చాలా మందిని...