యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు విధింపు..!
వెబ్ న్యూస్, బతుకమ్మ : యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు విధించే అంశం కేంద్రం పరిశీలనలో ఉంది. ముఖ్యంగా రూ.3,000 దాటిన యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించాలని ఆలోచన చేస్తోంది. బ్యాంకులు, పేమెంట్ సర్వీసు ప్రోవైడర్లు అందిస్తున్న సేవలకు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చడమే ఉద్దేశంగా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే చిన్న మొత్తాల చెల్లింపులపై మాత్రం ఎలాంటి ఫీజులు ఉండవని సమాచారం.