రుద్రూర్, బతుకమ్మ :
అమ్మకు అక్షరమాల పేరుతో మహిళా సంఘం సభ్యులకు అందరికీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా రుద్రూర్ మండల కేంద్రంలో ఆదివారం మహిళలకు అక్షర వికాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. రుద్రూర్ మండలంలోని 5 గ్రామ పంచాయతీలలో బొప్పాపూర్, రుద్రూర్, చిక్కడపల్లి, సులేమాన్ నగర్, రాయకూర్ క్యాంప్ గ్రామాల వారికి మొదటి విడతగా 238 మంది మహిళలకు అక్షర వికాసం పుస్తకం సహాయంతో తెలుగు రాయడం, చదవడం, అంకెలు గుర్తించడం, గత సంవత్సరం అక్టోబర్ 27 నుండి 150 రోజులపాటు మహిళలకు రాత్రిపూట వివోఏల సహాయంతో రాత్రి బడి నిర్వహించడం జరిగింది. అందులో నుండి 55 శాతం సభ్యులకు పరీక్ష పత్రం ఇచ్చి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి బాలగంగాధర్, ఎంఈఓ శ్రీనివాస్, డీపీఎం ఎస్ వెంకటేష్, ఐకేపి బస్వంత్, సిసిలు చిన్న గంగారం, పూల్ సింగ్, విట్టల్, వివోఏలు తదితరులు పాల్గొన్నారు.