Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 May 2025, 12:45 pm Posted by : ramakrishna

’బీఆర్ఎస్ లో చార్ పత్తా ఆట నడుస్తోంది‘

కల్వకుంట్ల సినిమా ప్రొడ్యూసర్ కాంగ్రెస్

బీజేపీ, బీఆర్ఎస్ ఎప్పుడు కలవవు

కేంద్ర మంత్రి బండి సంజయ్

కరీంనగర్, బతుకమ్మ: బీఆర్ఎస్ లో చార్ పత్తా ఆట నడుస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యవహారమంతా ఫ్యామిలీ డ్రామా అని, కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్ జరుగుతుందని ఎద్దేవా చేశారు. కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావు మధ్య  నాలుగు ముక్కలాట నడుస్తోందన్నారు. కల్వకుంట్ల సినిమాను ప్రొడక్షన్ చేస్తుందని కాంగ్రెస్ అని విమర్శించారు. కరీంనగర్ లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. బీజెపీ బీఆర్ఎస్ ఎప్పుడు కలవవని అన్నారు. కవిత అరెస్టు జరగకుండా ఉండేందుకు బీజేపీతో కలిసేందకు ప్రయత్నించారన్నారు. కవిత వ్యవహారంతో తెలంగాణ ప్రజలకు ఏదైనా లాభం ఉందా అని ప్రశ్నించారు. అవినీతి బీఆర్ఎస్ తో బీజేపీ కలవదని, కాంగ్రెస్ బీఆర్ఎస్ మాత్రమే కలిసి పని చేస్తాయన్నారు. వేములవాడ రాజన్న గోశాలలో కోడలు చనిపోవడం బాధాకర విషయమన్నారు. ఈ ఘటనపై ఈవో తో మాట్లాడతాన్నారు. కోడెల సంఖ్యకు అనుగుణంగా గోశాలను విస్తరించాలని అన్నారు. రాజన్న ఆలయ నిధులను మాజీ సీఎం వేరే చోట ఖర్చు చేశారని ఆరోపించారు. సైన్యం ఆత్మవిశ్వాసం దెబ్బతీసేలా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. పాక్ పై యుద్ధం కొనసాగుతుందని ప్రధాన మోడీ చెప్పారని గుర్తు చేశారు. ఉగ్రవాదాన్ని తుద ముట్టించే వరకు యుద్ధం కొనసాగుతుందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రైతుల ఆదాయాన్ని 80% రెట్టింపు చేశామన్నారు.  ఇంకో ఏడాది కాలంలో రైతుల ఆదాయాన్ని వంద శాతం రెట్టింపు చేస్తామన్నారు. అన్ని పంటలకు కనీస మద్దతు ధరను పెంచామన్నారు.  మార్కెట్ లో యూరియా ధరలు పెరిగినప్పటికీ రైతులకు సబ్సిడీ ఇస్తూ ఆ భారాన్ని కేంద్రమే మోస్తుందన్నారు.