Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 July 2026, 6:20 pm Posted by : ramakrishna

గురుకులంలో గందరగోళం

 

. . . నీళ్లు లేని కంజరకు కాలేజీ విద్యార్థులను పంపే యత్నం

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

పాఠశాలలో విద్యార్థులకు నీళ్ళు సరిపోవడం లేదని కంజర లో ఉన్న ఇందూర్ బాయ్స్ ను ధర్మారం (బి)  లో గతం లో నడిచిన ప్రైవేటు భవనంలోకి తరలించారు. మోపాల్ మండలంలోని కంజర బి సి బాలుర గురుకుల పాఠశాలలో నీటి కొరత ఎక్కువ ఉండడంతో భగీరథ నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ పాఠశాలలో కంజర, ఇందూర్ విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులకు సరిపడా నీళ్ళు అందకపోవడంతో ఇందులో కొనసాగుతున్న సుమారు 390 మంది ఇందూర్ బాయ్స్ ను ధర్మారం కు పంపించారు.

. . . నీళ్ళున్న ప్రాంతం నుంచి

ధర్మారంలో ఇంజినీరింగ్ కళాశాల నడిచి మూతబడిన భవన సముదాయంలో నిజామాబాద్ అర్బన్ పాఠశాల, కళాశాల పిల్లలతో పాటు, కంజర కళాశాల విద్యార్థులు ఉన్నారు. జిల్లాలో ఉన్న ఇందూర్, కంజర్, మోర్తాడ్, రాంపూర్ బి సి గురుకుల కళాశాలలోని సైన్సు విద్యార్థులు సైతం ధర్మారం కళాశాలలో ఉన్నారు. భవన సముదాయంలో నీళ్ళు పుష్కలంగా ఉన్నాయి. ఈ భవనంలో ఉన్న ఐదు కాలేజీలలోని సుమారు 400 మంది సైన్సు విద్యార్థులను నీళ్ల సౌకర్యం లేని పాఠశాలకు తరలించేందుకు రంగం సిద్దం చేసినట్లు తెలుస్తోంది. వర్షాలు ఎక్కువుంటే అందులో ఉన్న బోర్లలోకి జలసిరి ఉండేది. ఎల్ ని నో ప్రభావం వల్ల  ప్రస్తుతం అవి కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. కంజర పాఠశాల నుంచి విద్యార్థులను ధర్మారం ( ఈ ఏడాది తీసుకున్న భవనం) కు పంపించారు.  కాలేజీ విద్యార్థులను నీళ్ళు లేని కంజర కు పంపించాలనుకోవడం పిల్లలను మానసిక క్షోభకు లోను చేయడమేనని వీరి తల్లిదండ్రులు ఆక్షేపిస్తున్నారు.

. . . బాలికల కళాశాల పక్కనే

కంజరలో బి సి బాలుర పాథశాల సాంఘిక సంక్షేమ బాలికల పాతశాలకు సమీపంలోనే ఉంది. బి సి  స్కూల్ విద్యార్థులు చెబితే వినడానికి సుముఖత చూపుతారు. అదే కాలేజి పిల్లలు వినగలుగుతారా అనే సందేహాలు అద్యాపకులలో అప్పుడే మెదలుతున్నాయి.