Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 October 2024, 3:42 pm Posted by : ramakrishna

డీసీసీబీ వైస్ చైర్మన్ గా చంద్రశేఖర్ రెడ్డి

నిజామాబాద్, బతుకమ్మ: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) వైస్ చైర్మన్ గా నిజామాబాద్ మండలం బోర్గాం(పీ) గ్రామానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ర్టంలో ప్రభుత్వం మారిన తరువాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో అప్పటి డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తన పదవి నుంచి పక్కకు వెళ్లగా, బీఆర్ ఎస్ లో కొనసాగిన అప్పటి వైస్ చైర్మన్ రమేశ్ రెడ్డి కాంగ్రెస్ లో చేరి చైర్మన్ పదవిలో ఆసీనులయ్యారు. వైస్ చైర్మన్ ఎన్నికను సోమవారం నిర్వహించగా బోర్గాం(పీ) సొసైటీ చైర్మన్ చందరశేఖర్ రెడ్డి ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.