Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 August 2025, 1:23 pm Posted by : ramakrishna

చంద్రబాబు నరకానికి పోతావు : వైఎస్ జగన్

చంద్రబాబు, రేవంత్, రాహుల్ గాంధీ మధ్య హాట్ లైన్

ఏపీలో ఓటు చోరీపై  రాహుల్ గాంధీ మాట్లాడరేం..

వెబ్ న్యూస్, బతుకమ్మ :  వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఏపీలోని తాడెపల్లి గూడెంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబుకి ఇవే ఆఖరి ఎన్నికలు కావొ చ్చు అన్నారు.  ఇప్పటికైనా కృష్ణా రామా అనుకుంటే పుణ్యమైన వస్తుందని , లేదంటే నరకానికి పోతావని విమర్శించారు.  చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ మధ్య హాట్ లైన్ నడుస్తుందని ఆరోపించారు.  ఏపీలో ఓటు చోరీపై  రాహుల్ గాంధీ ఒక్క మాట మాట్లాడడన్నారు.  వీళ్ల పార్టీలు ఏంటో, వీళ్ల ఎజెండాలు ఏంటో అని చమత్కరించారు. పులివెందుల ZPTC ఉప ఎన్నిక కోసం చంద్రబాబు కుట్రలకు పాల్పడ్డారు.  చంద్రబాబుకు పరిపాలన మీద నమ్మకం ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని జగన్ డిమాండ్ చేశారు. ప్రజల్లో ఆ నమ్మకం లేదు కాబట్టే అమలు కాని హామీలు ఇచ్చి మోసం చేశారని విమర్శించారు. రాక్షస పాలన చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు. బందిపోట్ల ముఠానాయకుడు చంద్రబాబు అని వ్యాఖ్యనించారు. పులివెందుల అభ్యర్థి హేమంత్‌రెడ్డిని ఇంటినుంచి బయటకు రానీయలేదన్నారు.  డీఐజీ కోయ ప్రవీణ్‌ పర్యవేక్షణలో ఉప ఎన్నికలు జరిగాయన్నారు. చంద్రబాబు పాలనలో మాట వినని పోలీసు అధికారులపై కేసులు పెడుతున్నారన్నారు.