చంద్రబాబు చీటింగ్ లో పీహెచ్ డీ చేశారు :  వైఎస్ జగన్

తాడేపల్లిగూడెం, బతుకమ్మ :  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చీటింగ్ లో పీహెచ్ డీ చేశారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ వ్యాఖ్యనించారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు మీరిచ్చిన 143 హామీలు ఏమయ్యాయని ఆయన కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు ’బాబు షూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ‘ అనే నినాదం వినిపించారని.. ఇప్పుడు ’బాబు షురిటీ.. మోసం గ్యారెంటీ అన్నట్లుగా మారిపోయిందని సెటైర్ వేశారు. 9 నెలల కాలంలో అప్పులు మొత్తం రూ. లక్ష 45వేల...