తాడేపల్లిగూడెం, బతుకమ్మ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చీటింగ్ లో పీహెచ్ డీ చేశారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ వ్యాఖ్యనించారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు మీరిచ్చిన 143 హామీలు ఏమయ్యాయని ఆయన కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు ’బాబు షూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ‘ అనే నినాదం వినిపించారని.. ఇప్పుడు ’బాబు షురిటీ.. మోసం గ్యారెంటీ అన్నట్లుగా మారిపోయిందని సెటైర్ వేశారు. 9 నెలల కాలంలో అప్పులు మొత్తం రూ. లక్ష 45వేల కోట్లు అయ్యాయన్నారు. ఇన్ని అప్పులు చేసినా ’సూపర్ సిక్స్‘ అమలు చేశారా అని ప్రశ్నించారు. ఈడబ్బులన్నీ ఎవరీ జేబులోకి పోతున్నాయని నిలదీశారు. సంపద పెంచడం అంటే చంద్రబాబు ఆస్తులు పెంచుకోవడం అని వ్యాఖ్యనించారు.