Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 October 2024, 5:44 pm Posted by : ramakrishna

దుర్గామాత మండపం వద్ద చండీయాగం

రుద్రూర్, బతుకమ్మ : దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని రుద్రూర్ మండల కేంద్రంలోని గాంధీచౌక్ వద్ద కొలువుదీరిన దుర్గామాత మండపం వద్ద గురువారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుంకుమార్చన, విశేష పూజ, చండీయాగం, పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు. పలువురు దంపతులు చండీయాగంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఎనిమిదవ రోజు అమ్మవారు దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చింది. అనంతరం దుర్గామాత మండపం వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దుర్గామాత కమిటీ నిర్వాహకులు, దుర్గామాత మాలధారణ స్వాములు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.