Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 November 2025, 7:57 pm Posted by : ramakrishna

ఛలో ఢిల్లీకి తరలిరండి : పోచిరాం మాదిగ

బతుకమ్మ, కోటగిరి : ఈ నెల 17 వ తేదీన చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమానికి కదలి రావాలని  ఎమ్మార్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోచిరాం మాదిగ అన్నారు. కోటగిరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇటీవల సుప్రీంకోర్టు జడ్జ్ పై జరిగిన దాడికి నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఈనెల 17వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద   జరిగే ధర్నాకు దళిత బిడ్డలంతా  కదలి రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు హస్కుల శ్రీకాంత్,కన్నం శ్రీను, డప్పు సాయిలు, శ్రీకాంత్,రాంపూర్ సాయిలు తదితరులు పాల్గొన్నారు.