ఇందల్వాయి, బతుకమ్మ : హైదరాబాద్ లోని సరూర్ నగర్ మైదానం లో ఈ నెల 23 న జరిగే మాలల రణబేరి మహాసభ ను విజయవంతం చేయాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు చొక్కాం దేవి దాస్ పిలుపు నిచ్చారు. గురువారం ఇందలవాయి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి అనంతరం మాలల రణబేరి పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు సూచనలకు విరుద్ధంగా 2011 జనాభా లెక్కలతో సరైన ఎంపారికల్ డేటా లేకుండా కులాల వారిగా చేసిన ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో పెట్టిన విధంగా చేవెళ్ల డిక్లరేషన్ కు కట్టుబడి ఉండాలని,ఎస్సీల జనాభా కనుకునంగా ఎస్సీల రిజర్వేషన్ శాతాన్ని పెంచి దళితులకు న్యాయం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు చొక్కా దేవి దాస్,ఉపాధ్యక్షుడు గంగాధర్,జాయింట్ సెక్రటరీ గంగాధర్,నాంది వినయ్ కుమార్,రూరల్ ఇంచార్జీ తలారి సాయన్న,పాశం కుమార్,ఇందలవాయి అధ్యక్షులు నీరడి గంగాధర్,డిచ్పల్లి అధ్యక్షులు కాంతారావు,ధర్పల్లి అధ్యక్షులు లక్పతి,గౌరవ అధ్యక్షులు చెక్ పవర్ సాయన్న, పాశం నర్సింలు,నాయకులు అసది సాయన్న,తదితరులు పాల్గొన్నారు.