Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 March 2025, 6:36 pm Posted by : ramakrishna

ఛలో హైదరాబాద్ జయప్రదం చేయండి

రుద్రూర్, బతుకమ్మ : సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి నన్నేసాబ్ పిలుపు మేరకు మార్చ్ 25న జిపి కార్మికుల ఛలో హైదరాబాద్ జయప్రదం చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా కార్యదర్శి యేషాల గంగాధర్ కోరారు. సోమవారం రుద్రూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనం 26,000 చెల్లించాలని, పీఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలని శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మార్చ్ 25న జీపి కార్మికులు ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టుకున్నామని గ్రామపంచాయతీ కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జీపి కార్మికులు శంకర్, గంగారం, లక్ష్మి, సాయవ్వ తదితరులు పాల్గొన్నారు.