ఈ నెల 19న దివ్యాంగ ఉద్యోగుల చలో హైదరాబాద్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : దివ్యాంగ ఉద్యోగ, ఉపాద్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల 19 న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నిజామాబాద్ జిల్లా అద్యక్షుడు బి.శంకర్ రాజు తెలిపారు. నగరంలోని ఆర్ అండ్ బి విశ్రాంతి గృహంలో అధ్యక్షుని ఆద్వర్యంలో గురువారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగ ఉద్యోగుల హక్కుల సంక్షేమానికి సంబంధించిన అత్యంత కీలకమైన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా ప్రయత్నం జరుగుతున్నదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ కార్డుకు సంబంధించిన విధివిధానాలను...