ఛలో డిచ్పల్లి ముదిరాజ్ సంఘం
బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ జిల్లా ఖిల్లా ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షులు సందీప్ మాట్లాడుతూ ముదిరాజుల అందరు ఐక్యంగా ఉండాలని రానున్న స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుదాం రాజకీయాల్లో బానిస బతుకులు వద్దని మన హక్కులను సాధిద్దామని పిలుపునిచ్చారు. బెదిరించేవాడు లేకుంటే బెదిరించే వాడిదే రాజ్యం అయితది భవిష్యత్తు తరాలకు పునాదివేద్దాం అన్నారు. ఈ కార్యక్రమంలో కిల్లా ముదిరాజ్ సంఘం సభ్యులు సుమన్, పిస్కా సాయిలు తదితరులు పాల్గొన్నారు.