Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 September 2026, 3:00 pm Posted by : ramakrishna

సిర్నాపల్లి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి

 

ఇందల్వాయి, బతుకమ్మ  :

ఇందల్వాయి మండలంలోని సిర్నాపల్లి గ్రామంలో చాకలి ఐలమ్మ వర్ధంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహానికి సిర్నాపల్లి రజక సంఘం సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిత్యం ప్రజల సంక్షేమం కోసం పోరాటం చేసినా వీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఆమె ఆశయ సాధన కోసం గ్రామ గ్రామాన ఉన్న రజక సంఘం సభ్యులు కృషి చేయాలని ఈ సందర్భంగా రజక సంఘం సభ్యులు పిలుపునిచ్చారు. ఆమె నాడు స్వాతంత్రం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయలేదని ఆమె సేవలను కొనియాడారు.చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమానికి రజక సంఘం సభ్యులు అధ్యక్షత వహించగా గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, రజక సంఘం సభ్యులు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు.