సీపీఎం పార్టీ కార్యాలయంలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరనారి చిట్యాల ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సిపిఎం కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా చిట్యాల ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం జరిగిన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కేవలం హిందూ ముస్లింల మధ్య జరిగిన పోరాటం కాదని, బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టాలని అన్నారు. నిజాం...