ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

 నివాళులర్పించిన రజక సంఘం ప్రతినిధులు  బతుకమ్మ, మాచారెడ్డి: తెలంగాణ సాయుధ వీరనారి చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలను మాచారెడ్డి మండలం గద్య గజ్యానాయక్ తండా లో మండల రజక సంఘం ప్రతినిధులు ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం ప్రతినిధులు బాలరాజ్, శ్రీనివాస్, శ్రీనివాస్ రమేష్, నారాయణ, దేవయ్య రాజయ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు.