Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 September 2025, 7:08 pm Posted by : ramakrishna

తెలంగాణ స్ఫూర్తి ప్రదాత చాకలి ఐలమ్మ

ముప్కాల్, బతుకమ్మ: భూ విముక్తి కోసం పౌరుషాల ఓరుగల్లు గడ్డపై జన్మించిన పోరు బిడ్డ చిట్యాల చాకలి ఐలమ్మ తెలంగాణ స్ఫూర్తి ప్రదాత అని మలి దశ ఉద్యమ కారుడు బుల్లెట్ రాంరెడ్డి అన్నారు. ముప్కాల్ మండలంలోని రెంజర్ల లో రజక సంఘం ఆధ్వర్యంలో బుధవారం వర్థంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భూమి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పిన వీర వనిత అని ఆయన అభివర్ణించారు. కార్యక్రమంలో రజక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.