చాకలి ఐలమ్మ స్ఫూర్తి ఆదర్శం 

 నిజామాబాద్, బతుకమ్మ  : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తి అందరికీ ఆదర్శమని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అన్నారు.  జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బుధవారం చాకలి ఐలమ్మ  వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. వినాయక్ నగర్ లో గల ఐలమ్మ విగ్రహానికి కలెక్టర్, అదనపు కలెక్టర్ అంకిత్, ఇతర జిల్లా శాఖల అధికారులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా...