బతుకమ్మ నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగెనవార్ ఆదేశాల మేరకు గురువారం నిజామాబాద్ కమిషన రేట్ కార్యాలయంలో నిజామాబాద్ అదనపు డి.సి.పి (అడ్మిన్) బి.కోటేశ్వర రావు చాకలి ఐలమ్మ 129 వ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా చాకలి ఐలమ్మ ఫోటోకు పూలమాలలు వేసిన అనంతరం అదనపు డి.సి.పి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్యసాహసాలు. ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయని, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన తెగువ, పౌరుషం తెలంగాణ ఆస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చాటి చెప్పాయని పేర్కోన్నారు. ఈ సందర్బంగా ఆఫీస్ సూపరింటెండెంటులు శంకర్, బషీర్, పోలీస్ కార్యాలయం సిబ్బంది సి.సి.ఆర్.బి సిబ్బంది సి.ఎస్.బి సిబ్బంది, ఐ.టి కోర్ సిబ్బంది, పోలీస్ కంట్రోల్ రూమ్ సిబ్బంది, సెంట్రల్ ఫిర్యాదు సెల్ సిబ్బంది హాజరయ్యారు.