… ఇంచార్జీ డిఎస్పీగా చైతన్య రెడ్డి
కామారెడ్డి, బతుకమ్మ:
కామారెడ్డి జిల్లా అధనపు ఎస్పీగా బి. చైతన్య రెడ్డి భాధ్యతలు స్వీకరించారు. 2022 ఐపిఎస్ బ్యాచ్ కు చెందిన చైతన్య రెడ్డి గ్రే హౌండ్ లో అధనపు ఎస్పిగా పని చేసి ఇటివల కామారెడ్డి ఎ ఏస్పీగా బదిలీ చేశారు అధికారులు. బుదవారం కామారెడ్డి పోలిస్ కార్యాలయంలో చైతన్య రెడ్డి ఎఏస్ పిగా భాధ్యతలు స్వీకరించారు. కామారెడ్డి డిఎస్పి నాగేశ్వర్ రావు ఇటివల డిజిపి కార్యాలయంకు అటాచ్ చేసిన విషయం తెలిసిందే. దానితో కామారెడ్డి ఇంచార్జీ డిఎస్పీగా నియమించగా చైతన్య రెడ్డి భాధ్యతలు స్వీకరించి సబ్ డివిజన్ అధికారులతో సమీక్షించారు. ఈ సంధర్బంగా అధికారులు చైతన్య రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. తధనంతరం చైతన్యరెడ్డి, జిల్లా ఎస్పీ సిందుశర్మతో పాటు ఇతర అధికారులను మర్యాధపూర్వకంగా కలిసారు.