మార్కెట్ యార్డును సందర్శించిన పసుపు బోర్డు చైర్మన్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డును జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి సందర్శించారు. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా నియమితులైన తర్వాత తొలిసారి మార్కెట్ యార్డుకు వచ్చిన పల్లె గంగారెడ్డికి చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పాలకవర్గ సభ్యులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మార్కెట్  యార్డులో పసుపు క్రయవిక్రయాలను పరిశీలించారు. పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ రైతులు ఎండబెట్టిన తేమ శాతం లేకుండా తీసుకువచ్చిన పసుపునకు మంచి ధర లభిస్తుందన్నారు. కమిషన్ ఏజంట్లు...