Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 February 2025, 6:41 pm Posted by : ramakrishna

మార్కెట్ యార్డును సందర్శించిన పసుపు బోర్డు చైర్మన్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డును జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి సందర్శించారు. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా నియమితులైన తర్వాత తొలిసారి మార్కెట్ యార్డుకు వచ్చిన పల్లె గంగారెడ్డికి చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పాలకవర్గ సభ్యులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మార్కెట్  యార్డులో పసుపు క్రయవిక్రయాలను పరిశీలించారు. పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ రైతులు

Chairman of the Yellow Board visited the market yard

ఎండబెట్టిన తేమ శాతం లేకుండా తీసుకువచ్చిన పసుపునకు మంచి ధర లభిస్తుందన్నారు. కమిషన్ ఏజంట్లు కూడా రైతుల నుంచి ఎండిన పసుపును మాత్రమే యార్డుకు తీసుకువచ్చేలా అవగాహన కల్పించాలన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సెక్రటరి అపర్ణ,  గ్రేడ్ సెక్రటరి శ్రీధర్, కార్యాలయ సిబ్బంది ఉన్నారు.

Chairman of the Yellow Board visited the market yard