గొలుసు దొంగ అరెస్టు
బతుకమ్మ, ఏర్గట్ల : బాల్కొండ నియోజకవర్గంలోని మెండోరా , మోర్తాడ్, ముప్కాల్, ఏర్గట్ల ప్రాంతాల్లో గొలుసు దొంగతనాలకు పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు భీంగల్ సిఐ నవీన్ తెలిపారు. శుక్రవారం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. శుక్రవారం ఏర్గట్ల ఎస్సై డి.రాము తన సిబ్బందితో ఏర్గట్ల మండల కేంద్రంలోని అయ్యప్ప గుడి వద్ద వాహనాలు తనిఖీలు నిర్వహించామన్నారు. అక్కడ వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా మెండోరా మండలం దూదిగాం గ్రామానికి చెందిన చవాన్ కిరణ్ సింగ్ అనే యువకుడు అనుమానాస్పదంగా...