మామిడిపల్లి సమీపంలో చైన్ స్నాచింగ్ 

ఆర్మూర్, బతుకమ్మ : స్కూటిపై వెళ్తున్న మహిళ మెడలో నుంచి అగంతకులు గొలుసును లాక్కొని పరారీ అయ్యారు. ఈ సంఘటన ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి సమీపంలో గురువారం సాయంత్రం జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని తిరుమల  కాలనీకి చెందిన సింగారం లలిత జక్రాన్ పల్లి మండలం అర్గుల్ లో జరిగిన విందుకు హాజరై స్కూటిపై ఇంటికి వస్తుండగా మామిడిపల్లి ప్రాంతంలో బైక్ పై వచ్చిన అగంతకులు గొలుసును తెంపుకెళ్లాడు.