Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 September 2024, 5:26 pm Posted by : ramakrishna

ఎర్గట్ల శివారులో చైన్ స్నాచింగ్

చైన్ లాక్కొని పారిపోయిన దుండగులు

బతుకమ్మ, ఎర్గట్ల : ఎర్గట్ల మండల కేంద్రం శివారులో బుధవారం చైన్ స్నాచింగ్ ఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కమ్మర్ పల్లి మండల కేంద్రం వైపు నుండి స్కూటీ పై భార్యభర్తలిరువురు ఎర్గట్ల వైపు వస్తుండగా దుండగులు బైక్ పై వెంబడించి స్కూటీ వెనుక భాగనా కూర్చున్న మహిళ మేడలోంచి బంగారం చైన్ లాక్కొని పారిపోయారు. కస్తూరిభా స్కూల్ సమీపంలో జరిగిన ఈ ఘటనను చూసిన స్థానికులు దుండగులను వెంబడించిన ఫలితం లేకపోగా దుండగులు వర్షకొండ గ్రామం వైపు బైక్ పై పరారు అయ్యారు.