Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 December 2024, 8:54 pm Posted by : ramakrishna

కామారెడ్డిలో చైన్ స్నాచింగ్

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డిలోని అశోక్ నగర్ కాలనీలోని మహిళ మెడలోంచి మూడు తులాల బంగారు గోలుసును శనివారం గుర్తుతెలియని వ్యక్తులు తెంపుకెళ్లారని పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్ కాలనీకి చెందిన రాగుల భాగ్యమ్మ తన ఇంటి దగ్గరలోని కిరాణా షాపుకు వెళ్లింది. కిరాణా షాపు వద్ద నిలబడి ఉంది. ఇంతలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ద్విచక్రవాహనంపై కిరాణా షాపు వద్దకు వచ్చారు. అందులో ఒకరు వాహనంపై నుంచి దిగి మహిళ మెడలోని మూడుతులాల బంగారు గొలుసుని తెంపుకుని ద్విచక్రవాహనంపై పరారయ్యారు. రాగుల భాగ్యమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చైన్ స్నాచింగ్ కు పాల్పడిన వారిని పట్టకోవడానికి ప్రత్యే బృందాలను ఏర్పాటు చేశారు. సంఘటనా స్థలాన్ని కామారెడ్డి పట్టణ సీఐ, సిసిఎస్ సీఐ, ఎస్ఐ శ్రీరామ్ సందర్శించి విచారణ  చేపట్టారు.

Chain snatching in Kamareddy