Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 June 2025, 8:45 pm Posted by : ramakrishna

గుమ్మిర్యాల్ లో చైన్ స్నాచింగ్

బతుకమ్మ, ఏర్గట్ల: మండలంలోని గుమ్మిర్యాల గ్రామంలో పట్టపగలు చైన్స్ స్నాచింగ్ కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన నేరెళ్ల సాయవ్వ ( 60) వృద్ధురాలు మధ్యాహ్నం తన ఇంటి ఆరు బయట సేద తీరుతుండగా బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఒకరు బైక్ పై ముందుకెళ్లగా వెనకాల కూర్చున్న వ్యక్తి కొద్ది దూరం నుంచి నడుచుకుంటూ వచ్చి నేరెళ్ల సాయవ్వ మెడలో నుంచి రెండున్నర తులాల బంగారు గొలుసు అపహరించుకుని బైక్ పై పరారయ్యారు. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో వృద్దురాలు అరుస్తుండగా గ్రామంలోని యువకుడు దుండగులను కొద్ది దూరం వెంబడించిన ఫలితం లేకపోయింది. వెంటనే పోలీసులకు సమాచారం తెలపడంతో ఏర్గట్ల ఏఎస్ఐ లక్ష్మణ్ నాయక్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.