వృద్ధురాలి మెడలో నుంచి చైన్ స్నాచింగ్
బతుకమ్మ, నిజామాబాద్ క్రైం: వాకిలి ఊడుస్తున్న వృద్ధురాలి మెడలో నుంచి గెలుసు ఎత్తుకెళ్లిన ఘటన నగరంలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గౌతమ్ నగర్ లో అనసూయ అనే మహిళ నివాసం ఉంటుంది. ఎప్పటిలాగే శనివారం తెల్లవారు జామున తన ఇంటి ముందు వాకిలి ఊడుస్తోంది. ఈ సమయంలో ఒక దుండుగుడు అటువైపు నడుచుకుంటూ వచ్చి వృద్ధురాలి మెడలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసును లాక్కుని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మూడో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి...