Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 July 2026, 8:45 pm Posted by : ramakrishna

లక్షలాది మందిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపిన మహనీయులు చాగంటి

 

. . . గోమాత వైభవం ప్రవచనం అద్భుతం

 

. . . అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

లక్షలాది మంది లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపిన మహనీయులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు అని అర్భన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ అన్నారు. ఇందూరు గోసేవ సమితి, సూరన్న అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో నగర శివారు లోని భూమారెడ్డి ఫంక్షన్ హాల్ లో “గోమాత వైభవం” పై ప్రవచనం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ధన్ పాల్ గారు చాగంటి గారికి ఘనస్వాగతం పలికి సన్మానించి మాట్లాడారు. తన అద్భుతమైన ప్రవచనాలతో రామాయణం, భారతం, భాగవతం వంటి మహా గ్రంథాల్లోని విలువలను సామాన్యులకు సులభంగా అర్థమయ్యేలా వివరించడం జరుగుతుందన్నారు.

 

Chaganti is a noble soul who has instilled spiritual consciousness in millions of people.

 

మన సంస్కృతి సంప్రదాయాలను కుటుంబ విలువలు, ధర్మం యొక్క గొప్పతనాన్ని నేటి తరానికి చేరవేయడంలో ఆయన చేస్తున్న సేవ అమూల్యమైందన్నారు. సనాతన ధర్మ పరిరక్షణకు చాగంటి గారు చేస్తున్న యజ్ఞం ఎంతో గొప్పద్దన్నారు. అలాగే ఇందూరులో గోమాత వైభవం పై ప్రవచనం చెప్పడానికి రావడం ఇక్కడి భక్తుల పూర్వ జన్మ సుకృతం అన్నారు. సనాతన ధర్మంలో గోవు కు ప్రత్యేక స్థానం ఉందని, ముక్కోటి దేవతలను గోవులో చూస్తామన్నారు. శుభాకార్యాల్లోనూ గోదానం చేయడం, గోవు పాలు, గోమూత్రంకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. ప్రధానంగా గోమాత గురించి తెలియని విషయాలు ఎన్నో తెలియజేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఇందూరు గోసేవ సమితి, సూరన్న అయ్యప్ప సేవా బృందం ప్రతినిధులు పాల్గొన్నారు.

 

Chaganti is a noble soul who has instilled spiritual consciousness in millions of people.