Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 January 2026, 5:56 pm Posted by : ramakrishna

ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు

మద్నూర్, బతుకమ్మ:

 

మద్నూర్ తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న గిర్దావర్ ఎం.శంకర్, జూనియర్ అసిస్టెంట్ యు.రవి కుమార్ లు ఉత్తమ ఉద్యోగులుగా ఎన్నికయ్యారు. వీరిరువురికి గణతంత్ర దినోత్సవ సందర్భంగా కామారెడ్డి కలెక్టరేట్ లో ఇంచార్జీ కలెక్టర్ వి విక్టర్, డీఆర్వో మధుకర్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మద్నూర్ తహశీల్దార్ ఎం డి. ముజీబ్ మాట్లాడుతూ తమ ఉద్యోగులు ఉత్తమ ఉద్యోగులుగా ఎంపిక కావటం అభినందనీయమని, వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రశంసలు ఆదర్శంగా తీసుకొని ఇంకా నిబద్ధతతో పని చేయాలని సూచించారు. ప్రశంసా పత్రాలు అందుకున్న శంకర్, రవి లు మాట్లాడుతూ తమ సేవలను గుర్తించినందుకు జిల్లా కలెక్టర్ కి, బాన్సువాడ సబ్ కలెక్టర్ కి, మద్నూర్ తహసీల్దార్ కి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్ లో ఇంకా నిబద్ధతతో పని చేస్తామని, ప్రజలకు అత్యుత్తమ సేవలు అందిస్తామని తెలిపారు.

 

Certificates of appreciation for the best employees