ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ సాయిశ్యాంకు ప్రశంస పత్రం
బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ ఉద్యోగిగా ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ టి.సాయిశ్యాంకు ప్రశంస పత్రం అందజేశారు. తెలంగాణ స్టేట్ మైనింగ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ చేతుల మీదుగా గురువారం పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఉత్తమ ఉద్యోగిగా ప్రశంసా పత్రం అందుకున్నారు. సాయిశ్యాం ఎక్సైజ్ శాఖలో కోర్టు డ్యూటీ విధులు నిర్వహిస్తున్నారు. అయితే గతంలో సాయిశ్యాం 2023 సంవత్సరంలో అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని దళితరత్న అవార్డును అప్పటి...