Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 May 2026, 8:08 pm Posted by : ramakrishna

ఖరీఫ్ సీజన్ లో పంటలకు మద్దతు ధరలు ప్రకటించిన కేంద్రం

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

2026-27 ఖరీఫ్ పంటల సీజన్ కోసం కేంద్ర క్యాబినెట్ మద్దతు ధరను ప్రకటించింది. బుధవారం కేంద్రం ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఖరీఫ్ పంటల కోసం 2.6 లక్షల కోట్ల నిధులను కేటాయించారు. అందులో ప్రధానంగా క్వింటాల్ కు వరికి కనీస మద్దతు ధర రూ.2441గా నిర్ణయించగా వరి (ఏ గ్రేడ్ రకానికి) రూ.2461 నిర్ణయించారు. క్వింటాల్ జొన్నలకు (హైబ్రీడ్) కనీస మద్దతు ధర రూ.4023గా నిర్ణయించగా జొన్నలు (మల్లండి) రకానికి రూ.4073 గా నిర్ణయించారు. సజ్జలకు క్వింటాల్ కు కనీస మద్దతు ధర రూ.2900 గా ప్రకటించారు. కందుల కనీస మద్దతు ధర రూ.8415, పెసలు క్వింటాల్ కు రూ.8780, మినుములు రూ.8200, పత్తి (మధ్యశ్రేణి) రూ.8667, పత్తి (దీర్ఘశ్రేణి) రూ.8667, వేరుశనగా రూ.7517, పొద్దు తిరుగుడు రూ.8343, సోయాబిన్ (ఎల్లో) రూ.5708, నువ్వుల కనీస మద్దతు ధర రూ.10346 గా నిర్ణయించారు.