Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 September 2025, 1:03 pm Posted by : ramakrishna

దులీఫ్ ట్రోఫీ విజేత సెంట్రల్ జోన్

వెబ్ న్యూస్,బతుకమ్మ: దేశవాలీ క్రికెట్ లో ప్రతిష్ఠాత్మకమైన దులీప్ ట్రోఫీని సెంట్రల్ జోన్ గెలుచుకుంది. ఫైనల్ లో సౌత్ జోన్ ను ఓడించింది. సౌత్ జోన్ నిర్దేశించిన 65 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సెంట్రల్ జోన్ నాలుగు వికెట్లను కోల్పోయి ఛేదించింది. రజత్ పాటిదర్ నాయకత్వంలో సెంట్రల్ జోన్ రెండో సారి టైటిల్ ను గెలుచుకుంది. రజత్ పాటి దర్ నాయకత్వంలో గతేడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ ట్రోఫిని సాధించింది. సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్ 149, రెండో ఇన్నింగ్స్ 426.  సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్ 511. రెండో ఇన్నింగ్స్ 66/4.