. . . బీజేపీ ప్రశిక్షణా కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :
కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. నగరంలోని బోర్గాం లో కొనసాగుతున్న బీజేపీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ తరగతులు శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్ పాల్ మాట్లాడుతూ ఎన్నికలు లేనప్పుడు కూడా సమాజంలో పార్టీ పని నిరంతరం జరిగే విధంగా చూడాలన్నారు. అన్ని అనుబంధ సంస్థలతో సమన్వయం ఏర్పరుచుకోవాలన్నారు. సంస్థలు వేర్వేరు రంగాల్లో పని చేసిన లక్ష్యం మాత్రం ఒకటేనని చెప్పారు. ప్రపంచంలో భారత్ స్థానం గౌరవం పెరిగిందని, మోడీ నేతృత్వంలో అనేక పథకాలు గ్రామస్థాయి వరకు కూడా చేరుతున్నాయన్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి, కర్ణాటకలోని బెల్గావి ఎమ్మెల్యే అభయ్ పాటిల్ జిల్లా ప్రశిక్షణా తరగతుల ముగింపు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దినేష్ కులాచారి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి పాల్గొన్నారు.
