. . . బీజేపీ మండల్ ప్రెసిడెంట్ అరె రవీందర్
భీమ్ గల్, బతుకమ్మ :
మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెండడానికి కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, మత్స్యకారుల అభివృద్ధికి కేంద్ర సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని భీమ్ గల్ మండల బీజెపి ప్రెసిడెంట్ అరె రవీందర్ అన్నారు. మత్స్యకారుల సంఘం కార్యాలయ ఫర్నిచర్ కోసం కేంద్రం రూ.90,000 నిధులను మంజూరు చేయగా ఆ నిధులతో కార్యాలయానికి అవసరమైన ఫర్నిచర్‌తో పాటు, సభ్యుల పూర్తి వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేసేందుకు నూతన కంప్యూటర్ వ్యవస్థను కొనుగోలు చేయగా అట్టి డిజిటల్ సంఘన్ని రవీందర్ ఆధ్వర్యంలో ప్రారంభించారు.ఈ సందర్బంగా మత్స్య అభివృద్ధి బోర్డు పథకం ద్వారా తమ సంఘానికి లబ్ధి చేకూరడంపై మెండోరా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం (ఎఫ్‌సీఎస్) సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. నిధులు నేరుగా సంఘం బ్యాంకు ఖాతాలో జమ చేసినందుకు వారు కేంద్ర ప్రభుత్వానికి,ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, బాల్కొండ నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డిలకు సంఘం సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్‌ఎఫ్‌డీబీ పథకం ద్వారా మెండోరాతో పాటు భీంగల్ మండలంలోని మరో ఏడు మత్స్యకార సహకార సంఘాలకు కలిపి మొత్తం ఎనిమిది సంఘాలకు రూ.90,000 చొప్పున నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు. మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని, వాటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. చేపల పెంపకం, వ్యాపార విస్తరణ కోసం రూ.10 లక్షల నుంచి రూ.1 కోటి వరకు సబ్సిడీ ఆధారిత రుణాలు అందుబాటులో ఉన్నాయన్నారు.రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో టూ వీలర్లు, త్రీ వీలర్ వాహనాల వంటి రవాణా పథకాలు కూడా అందుతున్నాయన్నారు. కేంద్ర పథకాల ప్రయోజనాలను పొందేందుకు అవసరమైన మార్గదర్శకత్వం, సహాయ సహకారాలను అందించేందుకు బీజేపీ మండల శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మెండోరా సొసైటీ అధ్యక్షుడు ముస్లి ఎర్రన్న, ఉపాధ్యక్షుడు కల్లెడ రవికుమార్, కార్యదర్శి గజనవేణి మోహన్, డైరెక్టర్లు, సంఘం సభ్యులతో పాటు బీజేపీ జిల్లా నాయకులు నాగార్జున్ రెడ్డి, కిసాన్ మోర్చా మండల ఉపాధ్యక్షుడు తక్కురి అంజయ్య, బూత్ అధ్యక్షుడు వాల్గోట్ బాబురావు, తక్కురి రాము, పార్వతి శ్రీనివాస్ గౌడ్, నూకల లింబయ్య తదితరులు పాల్గొన్నారు.