- జహీరాబాద్ పార్లమెంట్ కోకన్వీనర్ జగన్ మోహన్ రెడ్డి
రుద్రూర్, బతుకమ్మ : నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు చేరవేయాలని జహీరాబాద్ పార్లమెంట్ కోకన్వీనర్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. 11 సంవత్సరాల మోదీ ప్రభుత్వం -సంకల్పంతో సాకారం సహా వివిధ పార్టీ కార్యక్రమాల మండల శాఖ కార్యశాల పురస్కరించుకొని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూచన మేరకు రుద్రూర్ మండల అధ్యక్షుడు ఆలపాటి హరికృష్ణఆధ్వర్యంలో శనివారం రుద్రూర్ మండల కేంద్రంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జహీరాబాద్ పార్లమెంట్ కోకన్వీనర్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ సమర్థవంతమైన నిర్ణయాత్మక నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది వికసిత్ భారత్ సహకారం దిశగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుందన్నారు. నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు చేరవేయాలన్నారు. అదే విధంగా ఆపరేషన్ సింధూర్ చారిత్రాత్మక విజయం సాధించిన నేపథ్యంలో శక్తివంతమైన భారతదేశంలో చూసి యావద్దేశం గర్విస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ఏముల గజేందర్, రేపల్లె సాయి ప్రసాద్, బేగరి వినోద్ కుమార్, బేగరి శివప్రసాద్, సతీష్ పవర్, గంగాధర్, సాయికుమార్, నాగరాజకుమారి, అంకెరాజేష్, విజయ్, శంకర్, భోజి గొండ అనిల్, రవితేజ, శ్రీనివాస్, మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.