Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 November 2025, 5:38 pm Posted by : ramakrishna

కేంద్రం ప్రభుత్వ పథకాలు శిశుమరణాల రేటును తగ్గిస్తున్నాయి

  • అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కేంద్రం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు శిశుమరణల రేటును తగ్గిస్తున్నాయని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. నేషనల్ నియోనేటలిజి ఫోరం తెలంగాణ (NNF–TS), ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ (IMA), భారతీయ పిల్లల వైద్యుల సంఘం (IAP) నిజామాబాద్ అబ్ స్టెస్ట్రిక్ అండ్ గైనకాలజీ అసోసియేషన్ (NOGA) సంయుక్తంగా వీరి ఆధ్వర్యంలో నిర్వహించిన “ పుట్టిన వెంటనే నవజాత శిశు భద్రత – అవగాహనా సదస్సు కార్యక్రమం” బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే  ధన్ పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే “నవజాత శిశు సంరక్షణ వారోత్సవాల” పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు.. ఐఎంఏ నిజామాబాద్, ఐఏపీ, ఎన్ఎన్ఎఫ్ టీఎస్ సంస్థలు ప్రజారోగ్య రంగంలో చేస్తున్న సేవలు అభినందనీయమైనవని  అన్నారు. సమాజంలో శిశు ఆరోగ్యంపై అవగాహన పెంపు ప్రతి కుటుంబాన్ని రక్షించే బాధ్యత” అని పేర్కొన్నారు. నేషనల్ నియోనేటలిజి ఫోరం తెలంగాణ అధ్యక్షులు డా. కె. శ్రీశైలం మాట్లాడుతూ.. నవజాత శిశు మరణాలను తగ్గించడానికి ప్రసవ సమయం నుండి పాటించాల్సిన ముఖ్యమైన శిశు సంరక్షణ పద్ధతులను వివరించారు. పుట్టిన తొలి గంటలో శిశువుకు అవసరమైన ఆరు కీలక అంశాలు వివరించారు. ఈ కార్యక్రమంలో  బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల్ల లక్ష్మి నారాయణ, మఠం పవన్, ఎన్ఎన్ఎఫ్ టీఎస్ అధ్యక్షులు డా. కె. శ్రీశైలం, ఎన్ఎన్ఎఫ్ టీఎస్ ఈసీ మెంబర్ డా. లింగారెడ్డి, ఐఎంఏ అధ్యక్షులు డా. విశాల్ ఆకుల, ఐఎంఏ నేషనల్ యాక్షన్ కమిటీ చైర్మన్ డా. ఈ.రవీంద్ర రెడ్డి, ఏఎస్ఐ  రాష్ట్ర అధ్యక్షులు డా. టీ. జీవన్‌రావు, డా. అరవింద్ రెడ్డి, డా. ఎం.డి. రషీద్ అలీ, డా. నవీన్ మాలు, ఐఏపీ నిజామాబాద్ అధ్యక్షులు డా. సూర్యారావు, ప్రధాన కార్యదర్శి డా. సీహెచ్. శ్రీకాంత్, డా. అజ్జ శ్రీనివాస్, డా. నేతి బాలేశ్, డా. దీపక్ రాథోడ్, డా. పద్మజ, డా. సవిత రాణి, ఎన్ఓజీఏ  అధ్యక్షురాలు డా. మల్లేశ్వరి, కార్యదర్శి డా. శైలజ, ఐఎంఏ వైద్యులు డా. అరవింద్ రెడ్డి, డా. వినోద్ కుమార్ గుప్త, డా. పద్మజా, డా. వెంకట్, డా. శ్రీధర్, డా. అయ్యప్ప చంద్రశేఖర్, డా. మౌనిక, డా.హిమజ, డా. చంద్రశేఖర్, డా. నవీన్ మల్లు, డా. సవితా రాణి, డా. రామ్మోహన్, డా. అరుణ్ గుప్త, ప్రైవేట్ ఆసుపత్రుల ఎన్ఐసీయూ సిబ్బంది, ప్రగతి హాస్పిటల్, “అలా సరోజినమ్మ కాలేజ్ అఫ్ నర్సింగ్” విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Central government schemes are reducing infant mortality rate