వ్యవసాయ కార్మికుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం 

వ్యవసాయ కార్మికులను విస్మరిస్తున్న కేంద్రం ఏఐపీకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ.రమేష్   సిరికొండ, బతుకమ్మ : వ్యవసాయ కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని,వ్యవసాయ కార్మికులను కేంద్రం ప్రభుత్వం విస్మరిస్తున్నదని అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐపీకేఎంఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రమేష్ విమర్శించారు. బుధవారం  సిరికొండ మండలంలోని తూంపల్లి గ్రామంలో అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం( ఏఐపీకేఎంఎస్ ) ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మికుల సమస్యలను  కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు....