రుద్రూర్, బతుకమ్మ :
జనగణన కోసం అధికారులు ఏర్పాటు చేసిన ఎన్యూమరేటర్ స్థానంలో రుద్రూర్ మండల కేంద్రంలో సిఆర్పి విధులు నిర్వహించడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని కృష్ణ మందిరం నుంచి అంబం గల్లీ వరకు జనగణన కోసం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న క్లర్క్ ను నియమించారు. ఆమె జనగణన కోసం ఇంటింటికి వెళ్లకుండా విద్యాశాఖలో ఉన్న సిఆర్పితో పనులు చేపిస్తున్నారు. సిఆర్పిలు జనగణన బాధ్యతలు నిర్వహoచకూడదనే నిబంధన ఉన్నప్పటికీ విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు అదనంగా ఉన్నప్పటికీ సిఆర్పితో విధులు చేయించడం పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.