జన గణన విధులను పక్కాగా నిర్వహించాలి
. . . శిక్షణ తరగతుల్లో కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉద్బోధ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : జన గణన విధులను పక్కాగా నిర్వహించాలని, అప్పుడే ఆయా వర్గాల ప్రజలకు భవిష్యత్తులో కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ఒక అవగాహనకు వచ్చి కార్యాచరణను అమలు చేసేందుకు ఆస్కారం ఉంటుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. సెన్సెస్ – 2027 ను పురస్కరించుకుని జనాభా లెక్కల సేకరణ ప్రక్రియలో భాగస్వాములు అయ్యే తహసిల్దార్లకు, సంబంధిత శాఖల...