Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 December 2024, 6:16 pm Posted by : ramakrishna

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ప్రముఖుల నివాళి

ఢిల్లీ, బతుకమ్మ : భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థీవ దేహానికి శుక్రవారం ఢిల్లీలోని ఆయన నివాసంలో కాంగ్రెస్ ప్రముఖ నాయకులు నివాళులు అర్పించారు. నివాళులు అర్పించిన వారిలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుక్కు,  తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ , మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాంనాయక్, అనిల్ కుమార్ యాదవ్, మల్లు రవి, ఏఐసిసి కార్యదర్శి సంపత్ తదితరులు ఉన్నారు. అనంతరం మన్మోహన్ సింగ్ సతీమణి ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇంచార్జ్ దీపాదాస్ ముంన్షి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పరామర్శించారు.

Celebrities pay tribute to former Prime Minister Manmohan Singh